Municipal Elections 2020: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

ఈనెల 25వ తేదీన జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి ఆర్ డి ఓ వేణు మాధవ రావు అన్నారు.

S. Srikanth
Published on: 23 Jan 2020 8:08 PM IST
Municipal Elections 2020: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
X

తాండూరు: ఈనెల 25వ తేదీన జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి ఆర్ డి ఓ వేణు మాధవ రావు అన్నారు. మున్సిపల్ నూతన భవన కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో తాండూర్ మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఒక్కో గదిలో తొమ్మిది వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు ఒక్కో వార్డు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతోందని ఒక్కో రాజకీయ పార్టీకి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఓట్ల లెక్కింపు గదిలోకి అనుమతి ఉంటుందన్నారు.

ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లుగా 45 మంది, సహాయకులుగా మరో 45 మంది, ఓట్ల లెక్కింపు పరిశీలకులుగా 38 మంది సిబ్బందిని నియమించినట్లు ఆయన అన్నారు. అనంతరం డిఎస్పీ లక్ష్మీనారాయణ ఎన్నికల అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story