బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే : కవిత ట్వీట్

Arun Chilukuri
Updated on: 5 Sept 2020 3:01 PM IST
బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే : కవిత ట్వీట్
X

తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకున్నానని కరోనా పాజిటివ్ అని రిపోర్టులో వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని, ఐసొలేషన్ లో ఉండాలని సూచించారు. మరోవైపు మంత్రి హరీష్ రావుకు కరోనా సోకిందన విషయం తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు.

మాజీ ఎంపీ కవిత కూడా హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 'బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే. మీ సంకల్ప బలంతో కరోనా వైరస్‌ను ఓడించాలి' అని ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ బావ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇత‌రుల కంటే మీరు త్వ‌ర‌గా కోలుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని కేటీఆర్ అన్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story