మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొన్న యువకుడు

Alcohol Drunked Man Suicide Attempt : తాగిన మత్తులో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. వారు ఆ మైకంలో ఏం చేస్తుంటారో, ఏం మాట్లాడతారో కూడా తెలియదు.

Sumitra
Published on: 12 Aug 2020 3:54 PM IST
మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొన్న యువకుడు
X

Alcohol Drunked Man Suicide Attempt : తాగిన మత్తులో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. వారు ఆ మైకంలో ఏం చేస్తుంటారో, ఏం మాట్లాడతారో కూడా తెలియదు. మైకంలో ఉన్న వారు ఒక్కోసారి ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటారు. మరికొంత మంది వారికి వారే ప్రాణాలను తీసుంటారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు ఎన్నో చూస్తూనే వస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు తాగిన మైకంలో రోడ్డుపై వచ్చే పోయే వారిని గాయపర్చడానికి ప్రయత్నించి ఆఖరికి ఓ ట్రాన్స్ ఫార్మర్ ను ముట్టుకుని చనిపోయాడు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ప్రాణాలను బలితీసుకోబోయాడు. త్రాగిన మైకంలో పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రానికి చెందిన స్వామి అనే వ్యక్తి పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో ఓ రోజు రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. అలా తాగిన మైకంలో రోడ్డుపై అటు ఇటు తూగుతూ నడుచుకుంటూ వెళ్తూన్నాడు. అతనితో పాటు అతని వెంట ఓ పెట్రోల్ బాటిల్ ను కూడా తీసుకుపోయాడు. తాగిన మైకంలో ఉన్న ఆ వ్యక్తి ఏం అనుకన్నాడో ఏంటో ఒక్కసారిగా అతడి వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకోని నిప్పటించుకున్నాడు. అది చూసిన స్థానికులు కాలిపోతున్న స్వామిని మంటలను అర్పివేశారు. అనంతరం కాలిన గాయాలతో బాధపడుతున్న స్వామిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితు స్థానికులు ఇతని గురించి మరో విషయం తెలిపారు. స్వామి గతేడాది కూడా త్రాగిన మైకంలో అంగడి బజార్ లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఈ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.



Sumitra

Sumitra

Next Story