మంత్రి కేటీఆర్ కామెంట్స్‌కు కాంగ్రెస్ నేత సంపత్ కౌంటర్‌

Sampath Kumar: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అడ్డగోలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 9 July 2021 5:11 PM IST
AICC Secretary Sampath Kumar Slams KTR
X

సంపత్ కుమార్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Sampath Kumar: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అడ్డగోలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హెచ్చరించారు. సోనియా భిక్షతోనే కేసీఆర్‌, కేటీఆర్‌ అధికారం అనుభవిస్తున్నారని, చరిత్ర మరిచేపోయి మాట్లాడితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. రేవంత్‌ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరారని, సంతలో కొన్నట్లు నాయకులను కొనేవాళ్లా కాంగ్రెస్‌ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంపత్ పదవుల్లో ఉన్నామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. కేటీఆర్‌కు నిజంగానే ధైర్యముంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story