Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ పెరుగుతున్న నాన్‌వెజ్ ధరలు
Hyderabad: గత వారం రోజులుగా వరుసగా పెరుగుతున్న చికెన్ ధరలు * హైదరాబాద్‌లో రిటైల్ చికెన్ ధర రూ.260
Representational Image
Hyderabad: హైదరాబాద్ లో చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. ఏ రోజూ ఒక రేటు ఉండటం లేదు. ఈ రోజు ఒక ధర ఉంటే.. రేపు మరో రెండు రూపాయలు పెరుగుతోంది. సామాన్య జనం కొనలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. ఆదివారం చికెన్ వండుకుందామనుకునే కుటుంబాలు రేట్లను చూసి భయపడుతున్నాయి.
గతేడాది కరోనా సమయంలో కోడి మాంసమంటేనే దూరం పోయిన జనం ప్రస్తుతం పెరుగుతున్న రేట్లను చూసి బెంబేలెత్తుతున్నారు. వారంలో రెండుసార్లయినా చికెన్ కొని తెచ్చుకునేవారు.. ప్రస్తుతం ఒక రోజు తెచ్చుకోవాలంటేనే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చికెన్ అందకుండా పోతోంది.
Next Story




