సీఎం కేసీఆర్‌ను క‌లిసిన డీజీపీ అంజ‌నీ కుమార్

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన డీజీపీ అంజ‌నీ కుమార్

Arun Chilukuri
Published on: 31 Dec 2022 3:46 PM IST
After Taking Charge as DGP Anjani Kumar met CM KCR
X

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన డీజీపీ అంజ‌నీ కుమార్

Anjani Kumar: రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఈరోజు ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నూత‌న డీజీపీగా అంజ‌నీ కుమార్ శ‌నివారం మ‌ధ్యాహ్నాం బాధ్యత‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌తో పాటు ప‌లువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story