హైదరాబాద్ లో వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన యువకుడు

హైదరాబాద్ లో  వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన యువకుడు
x
Highlights

హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ వాగులని తలపించాయి. రోడ్లపై నీరు ఏరుల్లా పారింది. ఈ సమయంలో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి ట్రాఫిక్...

హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ వాగులని తలపించాయి. రోడ్లపై నీరు ఏరుల్లా పారింది. ఈ సమయంలో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఎలిబీనగర్ ప్రాంతంలో నీళ్లు రోటీలను ముంచేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో లింగోజి గూడ డివిజన్ కాకతీయ కాలనీ లోని ఏడో నెంబరు రోడ్డు నీట మునిగింది. సరిగ్గా అప్పుడే ఆరోడ్డున వెడుతున్న ఓ మహిళా(30 ) వర్షపు నీటిలో చిక్కుంది. ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకు పోవడం మొదలైంది. అదే రోడ్డులో ఓ భవనం లో నివాసముంటున్న ప్రశాంత్ దీనిని గమనించారు. వెంటనే కిందకు దిగి వచ్చి ఆ మహిళకు చేయి అందించి ఆమెను సురక్షితంగా లాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అక్కడి స్థానికులు అందరూ ప్రశాంత్ ను అభినందించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories