Karimnagar: హైనా అనే అడవి జంతువు సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

Karimnagar: హైనా దాడిలో మృతిచెందిన కుక్క

Shekhar G
Published on: 5 July 2023 11:25 AM IST
A Wild Animal Called Hyenas Is Roaming In Karimnagar District
X

Karimnagar: హైనా అనే అడవి జంతువు సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు 

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో హైనా అనే అడవి జంతువు సంచారం కలంకలం సృష్టించింది. గ్రామంలో రాత్రి హైనా కనిపించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. హైనా జంతువు కుక్కపై దాడి చేయగా కుక్క మృతి చెందింది. గ్రామస్తులు భయంతో కేకలు వేయడంతో హైనా జంతువు పక్కనే ఉన్న గుట్టలోకి వెళ్ళిపోయింది. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామంలో హైనా జంతువు సంచరిస్తుందని ఆనవాళ్లు గుర్తించారు.అధికారులు స్పందించి హైనా దాడులు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రి వేళ్లల్లో పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకి అధికారులు సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story