Top
logo

ప్రాణదాతకు నిలువ నీడ కరువు..ఇది 'శవాల శివ' కథ!

ప్రాణదాతకు నిలువ నీడ కరువు..ఇది శవాల శివ కథ!
X
Highlights

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇలా కారణమేదైనా క్షణికావేశంతో ఆత్మహత్యల కోసం హుస్సేన్ సాగర్ లో దూకుతుంటారు....

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇలా కారణమేదైనా క్షణికావేశంతో ఆత్మహత్యల కోసం హుస్సేన్ సాగర్ లో దూకుతుంటారు. అయితే అలాంటి వారిని గుర్తించి, కాపాడి మరో పునర్జన్మను కల్పిస్తున్నాడు. హుస్సేన్ సాగర్ లో ఆత్మహత్య చేసుకోవడం కోసం దూకిన వారిని కాపాడటంలో అతడు సెంచరీ దాటాడు. ఎందరినో కాపాడి వాళ్ల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆ వ్యక్తి ఎవరో hmtv ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇతని పేరు శివ. హుస్తేన్ సాగర్ తీరంలో ఈ పేరు చెబితే తెలియని వారుండరు. శవాల శివగా ప్రతి ఒక్కరికి ఇతడు సుపరిచితమే. సాగర్ లో ఎన్నో గల్లంతైన మృత దేహలను వెలికి తీయండంలో లేక్ పోలిసులకు సహకరిస్తున్నాడు. గత 23 ఎళ్ళులో హుస్సెన్ సాగర్ లో ఆత్మహత్యాయత్నం చేసుకునే 114 మంది ప్రాణాలను కాపాడాడు శివ. ఇలా చాలామందికి ప్రాణదాతగా నిలిచిన శివ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు రోడ్డుపై కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. వినాయక నిమజ్జనం తరువాత సాగర్ లో ఉండే విగ్రహ చువ్వలను ఏరీ అమ్ముకుని వచ్చిన ఆ డబ్బులతో ప్రస్తుతం జీవనం సాగిస్తున్నాడు.

శివ అసలు పేరు వడ్డే హనుమంతు. ఐదేళ్ళ ప్రాయంలో హైదరాబాద్ కు వచ్చిన ఇతను ఓ ఆనాద. మల్లేశ్వరమ్మ అనే మహిళ ఇతడిని చేరదీసింది. చిన్నప్పుడు మల్లేశ్వరమ్మ కుమారుడు చెరువులో పడి చనిపోయాడు. ఆ ఘటన శివను కలిచి వేసింది. ఇక ఏ తల్లికి అలాంటి కడుపుకోత ఉండకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు. శివకు ఏడుగురు సంతానం. వారిలో ముగ్గురిని లేక్ పోలీస్ ఇన్ స్టెక్టర్ ధనలక్ష్మి గురుకుల పాఠశాలలో చేర్పించారు. పోలీసులకు ఎటు వంటి సహయం కావలన్నా శివకే ఫోన్ చేస్తారు. ఏ చెరువులో ఎవరు పడిపోయిన సమాచారం శివకే వస్తుంది. ప్రస్తుతం శివ ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. మంచాన పడ్డ తన కుమారుడికి సరైన తిండి పెట్టలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యాడు.

శివ ప్రతిభ, సేవలను గుర్తించిన డీజీపీ మహేందర్ రెడ్డి హోంగార్డ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అలాగే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మేయర్ రామ్మోహన్ మాటిచ్చారు. అది కూడా నెరవేర లేదు. రకరకాల కారణాలతో ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు, చదువులు, ప్రేమ వ్యవహారం, కన్నపిల్లలు పట్టించుకోని వృద్ధులు ఇక్కడికి ఆత్మహత్య చేసుకోవడానికి వస్తుంటారని శివ తెలిపాడు. సమస్యలు వస్తునే ఉంటాయని అంతమాత్రానా ఆత్మహత్యలు చేసుకోకూడదని శివ కోరుతున్నాడు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని సూచించాడు. సేవా దృక్పదంతో హుసేన్ సాగర్ తీరంలో అందుబాటులో ఉంటానంటున్న శివకు ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిద్దాం.


Web TitleA special story on Shiva who retrieves bodies from Hussain Sagar
Next Story