నాలుగో తరగతి విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్‌

principal beat student
x
principal beat student
Highlights

స్కూళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పిన విద్యార్థిని.. ప్రిన్సిపల్‌ చితక్కొట్టిన ఘటన.. హైదరాబాద్‌ వనస్థలీపురం లోని ఎన్ఆర్ఐ స్కూళ్లో జరిగింది. బాలల...

స్కూళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పిన విద్యార్థిని.. ప్రిన్సిపల్‌ చితక్కొట్టిన ఘటన.. హైదరాబాద్‌ వనస్థలీపురం లోని ఎన్ఆర్ఐ స్కూళ్లో జరిగింది. బాలల దినోత్సవం రోజున విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే ఆ యాత్ర వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న సాత్విక్‌.. టిఫిన్‌ బాక్స్‌ను తోటి విద్యార్థులు తిన్నారు. ఈ విషయాన్ని సాత్విక్‌.. తన నానమ్మకు చెప్పడంతో.. ఆమె స్కూల్‌కు వచ్చి.. యాజమాన్యాన్ని నిలదీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపల్‌ కృష్ణకుమారి విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో సాత్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆగకుండా వాంతులు కావడంతో.. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

keywords: principal, student, Vanasthalipuram


Show Full Article
Print Article
Next Story
More Stories