పూలకుండీలున్నాయా..జరభద్రం..!

Arun Chilukuri
Published on: 11 Nov 2020 1:00 PM IST
పూలకుండీలున్నాయా..జరభద్రం..!
X

ఇప్పటివరకు మనం బైకులు, కార్లు, బంగారం, నగదును ఎత్తుకెళ్లిన దొంగలను చూసి ఉంటాము. కానీ లేటెస్ట్‌గా ఓ మహిళా బల్కంపేటలో పూలకొండీలను దొంగతనం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఎస్సానగర్‌ పీఎస్‌ పరిధిలో ఈ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది.

అందరూ గాఢ నిద్రపోయే సమయంలో ఆమె ఇంటి ఎదుట ఉంచిన పూలకుండీలను దొంగలిస్తోంది. నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ అటూ ఇటూ చూస్తూ జాగ్రత్తగా తనవెంట తెచ్చుకున్న సంచిలో పూలకుండీలను పెట్టుకుని ఉడాయిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్‌ సీసీఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇది గమనించిన ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story