Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో..
Hyderabad: గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి.
Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో..
Hyderabad: గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కె.విష్ణువర్ధన్ KPHBలోని ఓ హాస్టల్‌లో ఉంటూ నగరంలో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
నిత్యం వీరాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయుడిని దర్శించుకునే అలవాటు ఉంది. ఉదయం కూడా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేశాక, నీళ్లు తాగేందుకు వచ్చి అక్కడే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతోపాటు ఇటీవలే వైరల్ జ్వరంతో బాధపడినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Next Story




