ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య!

నువ్వు లేక నేను లేను అంటూ ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది.

Krishna
Updated on: 25 Oct 2020 8:30 PM IST
ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య!
X

నువ్వు లేక నేను లేను అంటూ ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. దసరా పర్వదినంన గ్రామంలో విషాదం నెలకొంది. మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామానికి చెందిన సల్ల మహేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇటీవల అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందాడు. రోజువారీ వీధుల్లో భాగంగా ఇంటి నుంచి వచ్చి అమ్మాయి సమాధి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. అతని సెల్ ఫోన్లో నేను ఆత్మహత్య చేసుకుంటాడని స్టేటస్ పెట్టగా.. స్టేటస్ చూసి స్నేహితులు సమాచారం అందించగా అప్పటికి మృతి చెందాడు.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సంఘటన స్థలానికి మహాదేవపూర్ ఎస్సై అనిల్ కుమార్ చేరుకొని పరిశీలించారు. శవ పరీక్ష నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడు ఓ అమ్మాయిని ప్రేమంచగా ఆమె మృతిని తట్టుకోలేక జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. స్థానికంగా ఈ ఘటన అందర్నీ కలవరపరిచింది.

Krishna

Krishna

Next Story