Top
logo

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చిరుత కలకలం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చిరుత కలకలం
X
Highlights

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చిరుత కలకలం సృష్టించింది. బయోడైవర్సిటీ చౌరస్తా వద్ద గల రొడామిస్త్రీ కాలేజ్‌లో కుక్కను ఎత్తుకెళ్లింది. శనివారం మధ్యాహ్యం 2 గంటల సమయంలో కాలేజీ ఆవరణలోకి వచ్చిన చిరుత... కుక్కను వేటాడి ఎత్తుకెళ్లింది.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చిరుత కలకలం సృష్టించింది. బయోడైవర్సిటీ చౌరస్తా వద్ద గల రొడామిస్త్రీ కాలేజ్‌లో కుక్కను ఎత్తుకెళ్లింది. శనివారం మధ్యాహ్యం 2 గంటల సమయంలో కాలేజీ ఆవరణలోకి వచ్చిన చిరుత... కుక్కను వేటాడి ఎత్తుకెళ్లింది. దీంతో కాలేజీ సిబ్బంది రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కాలేజీ భవనంపై రక్తపు మరకలను గుర్తించిన అటవీశాఖ అధికారులు.. పక్కనే ఉన్న గుట్ట మీదకు చిరుత వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, ప్రధాన రహదారులు ఉన్న ఈ ప్రాంతలోకి చిరుత ఎలా వచ్చిందో అర్థం కావడంలేదంటున్నారు అధికారులు.చిరుత కోసం ఫారెస్ట్‌ అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు.

Web TitleA leopard has created a stir in Gachibowli Hyderabad
Next Story