హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

Hyderabad: ప్రముఖ యూనివర్సిటీల సర్టిఫికెట్లు తయారు చేస్తున్న కేటుగాడు. పదో తరగతి నుంచి పీజీ వరకు ఫేక్ సర్టిఫికెట్స్.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 9:13 AM IST
A gang of forged certificates conspired in Hyderabad
X

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

Hyderabad: దేశంలో గుర్తింపు పొందిన పలు యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా ఆగడాలను hmtv వెలుగులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలో గుర్తింపు పొందిన పలు యూనివర్సిటీల సర్టిఫికెట్లను తయారు చేస్తున్నాడు కాఫీ బినో ఫౌండర్ స్వామి ముదం గౌడ్. పదో తరగతి నుంచి పీజీ వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్న నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఇలా గత 12 ఏళ్లుగా వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు. కొంత మంది బాధితులు hmtvని ఆశ్రయించారు. దీంతో స్వామి ముదం గౌడ్ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని hmtv వెలుగులోకి తీసుకొచ్చింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story