Corona Positive for Lions: నెహ్రూ జూలో 8 సింహాలకు పాజిటివ్

Samba Siva Rao
Updated on: 4 May 2021 11:19 AM IST
8 Lions Test Corona Positive at Hyderabads Nehru Zoological | Lions at Zoo Coronavirus
X

సింహాలు (ఫైల్ ఇమేజ్)

Corona Positive for Lions: కరోనా వైర‌స్ రెండో ద‌శ‌ అంతకంతకూ విస్తరిస్తోంది. మ‌న‌షుల్లో ఒకరి నుంచి మరొకరి సోకే ప్రాణాంతక వైర‌స్ తాజాగా జంతువులకు వ్యాపించింది. అమెరికాలో క‌రో్నా మొద‌టి ద‌శ‌లో తొలిసారిగా ఓ పులికి సోకిన ఘ‌ట‌న తెలిసిందే. అయితే క‌రోనా మ‌హమ్మ‌రి తొలిసారిగా 8 సింహాలకు సోకింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ జూపార్క్‌లో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు జూ అధికారులు. 8 సింహాల నమూనాలను పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించారు. సెకండ్ వేవ్‌లో జంతువులకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలతో పార్కులు మూసివేశారు. ఆదివారం నుంచి జూ పార్క్‌లో సందర్శకులకు అనుమతి నిరాకరించారు అధికారులు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story