Kilimanjaro: అద్భుతం సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి

7 Year Old Virat Chandra Scales Mount Kilimanjaro
x

అద్భుతం సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి

Highlights

Kilimanjaro: ఏడేళ్ల బుడతడు అద్భుతం సృష్టించాడు. ఎంతో అనుభవం ఉన్నవారికే సాధ్యం కానిది చేసి చూపించాడు.

Kilimanjaro: ఏడేళ్ల బుడతడు అద్భుతం సృష్టించాడు. ఎంతో అనుభవం ఉన్నవారికే సాధ్యం కానిది చేసి చూపించాడు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒక్కటైన శిఖరాన్ని అధిరోహించాడు. కేవలం ఏడేళ్ల పసిప్రాయంలోనే కిలిమాంజారోను అధిరోహించి శెభాష్ అనిపించుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన చిన్నారి విరాట్ చంద్ర. ఈ ఘనతతో అతి చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

మార్చి 6న విరాట్ చంద్ర ఈ ఘనత సాధించాడు. ముందు చాలా భయమేసినా తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు. తన కజిన్ల ద్వారా పర్వతాధిరోహణపై ఇష్టం పెరిగిందన్న విరాట్ వారి అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని అన్నాడు. దీంతో వారిలాగానే తాను కూడా పర్వతాధిరోహణ చేయాలనుకున్నానని చెప్పాడు. దీని గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, భరత్ సార్ దగ్గర శిక్షణను ఇప్పించారని వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories