Coronavirus: తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు.. 33 మంది మృతి

Coronavirus: రాష్ట్రంలో 3.87 లక్షలు దాటేసిన కరోనా కేసులు * తెలంగాణలో ఇప్పటివరకు 3,87,106 కేసులు నమోదు

Sandeep Eggoju
Updated on: 24 April 2021 1:42 PM IST
7 Thousand New Corona Cases Registered In Telangana 24-04-2021
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: కరోనా కేసుల నమోదులో తెలంగాణ ఆల్‌ టైం రికార్డు సృష్టించింది. రోజువారీ కేసుల సంఖ్య 7వేలు క్రాస్‌ చేసింది. రాష్ట్రంలో కొత్తగా 7వేల 432 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 14వందల 64 కేసులు రికార్డు కాగా మేడ్చల్‌లో 606, రంగారెడ్డి జిల్లాలో 504 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 87వేల 106కు చేరుకుంది.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 19వందల 61 కరోణా మరణాలు చోటుచేసుకున్నాయి. 3లక్షల 26వేల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 58వేల 148 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 86.16 శాతం కాగా మరణాల రేటు 0.51 శాతంగా నమోదైంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story