Top
logo

కూరగాయల మార్కెట్ కూల్చివేత పనులను చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు

కూరగాయల మార్కెట్ కూల్చివేత పనులను చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు
X
Highlights

నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న కూరగాయల మార్కెట్ కూల్చివేత పనులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్...

నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న కూరగాయల మార్కెట్ కూల్చివేత పనులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు చేపట్టారు. మార్కెట్ కూల్చివేతకు వ్యతిరేకంగా దుకాణదారులు నిరసన వ్యక్తం చేయడంతో మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న 60 సంవత్సరాల పురాతన మార్కెట్లో 56 కి పైగా షాపులు ఉన్నాయి. దీనిని 1960 లో నిర్మించారు. అయితే గత ఏడాది డిసెంబర్లో ఈ స్థలాన్ని ఖాళీ చేయమని దుకాణదారులకు నోటీసులు ఇచ్చామని మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.

ఎన్ని సార్లు నోటీసులు వచ్చినప్పటికీ దుకాణదారులు ప్రాంగణాన్ని ఖాళీ చేయలేదు. అయితే వారు ఖాళీ చేయాలంటే మార్కెట్ ని పడగొట్టడం తప్ప వేరే మార్గం లేదని అధికారులు తెలిపారు. కొత్త మార్కెట్ నిర్మాణం తరువాత, ప్రస్తుతం ఉన్న దుకాణదారులకు బిడ్ లో పాల్గొనడానికి, లీజు హక్కులను పొందడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఇక మున్సిపల్ అధికారులు వ్యాపారదారులు తమ దుకాణాల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసారు.

Web Title60 year old vegetable market in Narayanaguda demolished
Next Story