ఎన్నికల నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పనుల పరుగు!

ఎన్నికల నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పనుల పరుగు!
x
Highlights

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. లాక్‌డౌన్‌ సమయాన్ని ఫుల్‌గా ఉపయోగించుకున్న జీహెచ్‌ఎంసీ చాలా పనులు పూర్తి చేసింది. అయితే ఈ అయిదేళ్ల...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. లాక్‌డౌన్‌ సమయాన్ని ఫుల్‌గా ఉపయోగించుకున్న జీహెచ్‌ఎంసీ చాలా పనులు పూర్తి చేసింది. అయితే ఈ అయిదేళ్ల కాలంలో గ్రేటర్‌ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఎన్ని ప్రారంభోత్సవాలకు శిలఫలకాలు వేశారు.? ఎన్ని పనులు శంకుస్థాపన దశలోనే ఆగిపోయాయి? సిటీ అభివృద్ధి పనులపై నగర వాసులు ఏమంటున్నారు...?

హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ఇప్పటికే ప్లై ఓవర్‌ వంటి పనులను హడవుడిగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పనులను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని టీఆర్‌ఎస్‌ బావిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి అభివృద్ధి పనులను ఆరా తీస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. గ్రేటర్‌లో అన్ని రకాల పథకాలను పరుగులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు.

ఇక నగరంలో కొత్తకొత్తగా ఎన్నెన్నో పార్కులు. వివిధ థీమ్‌లు, ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేస్తున్నారు. చాలా జంక్షన్ లను సుందరీకరించడం వల్ల చాలా అందమైన వ్యూ కనిపిస్తోంది. గత ఎన్నికల హామీలల్లో ప్రధానంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీపై నగర వాసుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సమస్యగానే ఉందని కొందరు మండిపడుతున్నారు. చినుకు పడితే చెడిపోయే రోడ్డు వ్యవస్థపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మొత్తంగా గడచిన నాలుగున్నరేళ్లలో చేసిన పనులన్నీ వచ్చే నాలుగునెలలు ప్రజల మదిలో నిలిచేలా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఆ లక్ష్యంతోనే కలిసివచ్చిన లాక్‌డౌన్‌ కాలంలో ఫ్లై ఓవర్ల వంటి భారీ పనులూ పూర్తిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories