జంట నగరాల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. గంటల వ్యవధిలోనే ఆరుచోట్ల చైన్ స్నాచింగ్..

6 Chain Snatching Cases Recorded In 2 Hours in Hyderabad
x

జంట నగరాల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. గంటల వ్యవధిలోనే ఆరుచోట్ల చైన్ స్నాచింగ్..

Highlights

జంట నగరాల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. గంటల వ్యవధిలోనే ఆరుచోట్ల చైన్ స్నాచింగ్..

Hyderabad: జంట నగరాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరుచోట్ల చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే ఆరుచోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డారు దొంగలు. ఉప్పల్ , నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో పలువురి మహిళల మెడల్లోంచి గోల్డ్ చైన్స్ ను లాక్కెళ్లారు. ఓయూ పీఎస్‌ పరిధి రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.

ఇంటి ఎదుట పూలు కోస్తుండగా.. వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అడ్రస్‌ అడిగే క్రమంలో జానకమ్మ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. వరుస స్నాచింగ్‌ల నేపథ్యంలో అలర్టయ్యారు. స్నాచర్స్ ను పట్టుకునేపనిలో పడ్డారు. స్నాచింగ్‌లు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చోరీ చేసిన వాహనాలతోనే దుండగులు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్టు గుర్తించారు. దీంతో నగరం వ్యాప్తంగా నెంబర్‌ ప్లేట్‌లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories