Coronavirus: ఉస్మానియా యూనివర్శిటీలో కరోనా కలకలం

Coronavirus: హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. చాపకింద నీరులా వైరస్‌ విజృంభిస్తోంది.

Arun Chilukuri
Published on: 19 March 2021 4:43 PM IST
5 PG Students at Osmania University Hostel Test Coronavirus positive
X

Coronavirus: ఉస్మానియా యూనివర్శిటీలో కరోనా కలకలం

Coronavirus: హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. చాపకింద నీరులా వైరస్‌ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. విద్యాలయాలే హాట్ స్పాట్స్‌గా కోవిడ్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు వైరస్ బారిన పడగా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్శిటీలో కూడా కరోనా కలకలం రేగింది. ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో ఐదుగురు పీజీ విద్యార్ధినులకు వైరస్ సోకడంతో కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించారు. హాస్టల్‌‌లో మొత్తం 300మంది విద్యార్ధినులు ఉండటంతో అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి రూమ్స్‌‌ను శానిటైజ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story