విషాదం: తండ్రి కారు కింద పడి తనయుడు మృతి

Hyderabad: హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బాలుడి మృతి

Sandeep Eggoju
Updated on: 22 Nov 2021 5:15 PM IST
విషాదం: తండ్రి కారు కింద పడి తనయుడు మృతి
X

విషాదం: తండ్రి కారు కింద పడి తనయుడు మృతి

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ కాస్మోపాలిటన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ వాచ్‌మెన్‌ కారును రివర్స్‌ తీసుకుంటుండగా కారు చక్రాలకింద పడి అతని కుమారుడు మృతి చెందాడు. జహీరాబాద్‎కు చెందిన అంగిర్ల లక్ష్మణ్, రాణి దంపతులు సిటీకి వచ్చి మన్సూరాబాద్‎లోని కాస్మోపాలిటన్ కాలనీలోని ఓ అపార్ట్‎​మెంట్​లో వాచ్‎మెన్‎గా చేరారు. వీరికి కుమార్తె భవాని, కొడుకు సాత్విక్ ఉన్నారు.

ఆదివారం ఉదయం10 గంటల సమయంలో లక్ష్మణ్​ అపార్ట్​మెంట్​లోకి కారును రివర్స్ తీస్తుండగా అక్కడే ఆడుకుంటున్న అతని కొడుకు సాత్విక్ కారు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. అది గమనించకుండా లక్ష్మణ్ కారును అలాగే వెళ్లనీయడంతో సాత్విక్ మీదుగా కారు వెళ్లింది. దాంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడిని కామినేని హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story