Coronavirus: ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం

Coronavirus: వైరాలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు కోవిడ్‌

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 3:34 PM IST
29 Students Tested Corona Positive in Khammam Gurukul School
X
Representational Image

Coronavirus: ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేగింది. వైరా నియోజకవర్గ కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 29 మంది 8వ తరగతి విద్యార్థినులకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి విద్యార్థినులు జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా.. 29 మంది విద్యార్థినులకు కరోనా కన్ఫామ్‌ అయింది. దీంతో.. వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

మొత్తం ఈ పాఠశాలలో ఐదు వందల మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్‌ శ్రీలక్ష్మి తెలిపారు. ప్రతి విద్యార్థినికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి.. వారిని తమ, తమ ఇళ్లకు పంపుతున్నామని చెప్పారు. మరోవైపు స్టూడెంట్స్‌కు కరోనా సోకడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story