Hyderabad: హైదరాబాద్‌లో 25 మంది నైజీరియన్లు అరెస్ట్

Hyderabad: అరెస్ట్ అయిన వారిలో నైజీరియన్ యూట్యూబ్ తెలుగు సింగర్ చిచా చార్లెస్

Sandeep Eggoju
Published on: 2 Dec 2021 1:03 PM IST
25 Nigerians Arrested in Hyderabad
X
చిచ చార్లెస్ అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ సన్ సిటీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. విదేశీయులే లక్ష్యంగా 40 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసిన 25 మంది నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నైజీరియన్ యూట్యూబ్ తెలుగు సింగర్ చిచ్చా చార్లెస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story