వైరస్ సోకి 2వేల కోళ్లు మృతి

Dhivi
Updated on: 10 Feb 2025 9:00 AM IST
వైరస్ సోకి 2వేల కోళ్లు మృతి
X

కొన్ని రోజులుగా వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. అంతుచిక్కని వైరస్ తో కోళ్లు మ్రుత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల కోళ్లు మరణించాయి. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులోని ఓ పౌల్టీఫాంలో ఆదివారం దాదాపు 2వేల బాయిలర్ కోళ్లు మరణించాయి. ఇటీవల మండలంలోని తిర్మలాపూర్ లో రెండువేలు, బీర్కూర్ మండలంలోని చించోలి, కిష్టాపూర్ లో మూడువేల కోళ్లు మరణించాయి. మరణించిన కళ్లను గ్రామ శివారులో జేసీబీల సాయంతో గుంతలు తీసి అందులో వాటిని పూడ్చిపెడుతున్నారు. అంతుచిక్కని వైరస్ సోకి కోళ్ల మరణించడంతో పౌల్ట్రీ నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dhivi

Dhivi

Next Story