Concentrators: చైనా నుంచి తెలంగాణకు 200 కాన్సన్‌ట్రేటర్లు

Concentrators: కేటీఆర్‌కు అందించిన గ్రీన్ కో * గ్రీన్ కో సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు

Sandeep Eggoju
Updated on: 16 May 2021 4:16 PM IST
200 Oxygen Concentrators From China To Telangana
X

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ (ఫైల్ ఇమేజ్)

Concentrators: చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందాయి. వాటిని దిగుమతి చేసిన గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు.. మంత్రి కేటీఆర్‌కు అందించారు.. కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలు పంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించిందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటుందన్నారు. గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం పట్ల మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా రోగులకు చికిత్స అందించేందుకు.. ఆ మేరకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story