ప్రయివేటులో కరోనా చికిత్స బిల్లు రూ. 20 లక్షలు

ప్రయివేటులో కరోనా చికిత్స బిల్లు రూ. 20 లక్షలు
x
Representational Image
Highlights

private Hospital corona treatment : కరోనా బారిన పడి వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరిన వారికి ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి.

private Hospital corona treatment : కరోనా బారిన పడి వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరిన వారికి ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. చికిత్స పేరిట బాధితుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో బయటికి రావడం మాత్రమే కాదు భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం, హైకోర్టు ప్రయివేటు ఆస్పత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసి సోకాజ్ నోటీసులు కూడా పంపించారు. అయినా కొన్ని హాస్పిటళ్ల తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే ఓ కరోనా పేషెంట్‌కు 22 రోజుల చికిత్స అందించి, రూ.20 లక్షలు బిల్లు వేసారు. ఇంత బిల్లు వేసినా చివరికి ఆ బాధితుడు మాత్రం బతికాడా అంటే అదీ లేదు. ఇక బాధితుని మృతదేహాన్ని డబ్బు మొత్తం కట్టే వరకు అప్పగించబోమని ఆస్పత్రి యాజమాన్యాలు చెప్పిన తీరు విస్మయానికి గురిచేస్తుంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ముషీరాబాద్‌కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు బాధితున్ని సికింద్రాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు 22 రోజులపాటు అతనికి చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆఖరికి ప్రాణాలు కోల్పోయారు. అయితే అప్పటికే అతనికి వైద్యం అందించినందుకు ఆస్పత్రి యాజమాన్యాలు రూ.20 లక్షలు బిల్లు వేశాయి. అయితే బాధితుని కుటుంబ సభ్యులు అప్పటికే ఇన్సూరెన్స్ ద్వారా రూ.11.5 లక్షలు కట్టి బాధితుని మృతదేహం ఇవ్వాలని కోరారు. కానీ ఆస్పత్రి యాజమాన్యాలు మిగతా మొత్తం కూడా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని తేల్చి చెప్పారు. వారికి మృతదేహాన్ని అప్పగించకుండా మార్చురీలోనే 40 గంటలపాటు ఉంచారు.

కాగా ఈ విషయం తెలుసుకున్న కొంత మంది క్రైస్తవ సంఘాల నాయకులు ఆస్పత్రి యాజమాన్యాలను నిలదీశాయి. అంతే కాదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతే కాక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో యాజమాన్యం అప్రమత్తమై మృతదేహాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించింది. డెడ్ బాడీ విషయమై పోలీసులు, జీహెచ్ఎంసీకి సమాచారం ఇచ్చామని.. టైం పడుతుందని చెప్పడంతోనే మార్చురీలో ఉంచామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. మిగతా డబ్బులు అడగకుండానే డెడ్ బాడీని అప్పగించామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories