Telangana: హైదరాబాద్ వేదికగా బయో ఏసియా 19వ వార్షిక సదస్సు

Telangana: *ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వర్చువల్‌గా సదస్సు *70 దేశాల నుంచి హాజరుకానున్న 30వేల ప్రతినిధులు

Rama Rao
Published on: 25 Jan 2022 9:27 AM IST
19th Edition of BioAsia to Start From Feb 24 in Hyderabad | TS New Today
X

 హైదరాబాద్ వేదికగా బయో ఏసియా 19వ వార్షిక సదస్సు

Telangana: హైదరాబాద్ వేదికగా బయో ఏసియా 19వ వార్షిక సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 24, 25తేదీల్లో వర్చువల్ విధానంలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30వేల పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ఫ్యూచర్ రెడీ నినాదంతో జరిగే ఈ సదస్సు లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుతం స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు, బయోటెక్‌ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్‌ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషిస్తారు. నోబెల్‌ గ్రహీతలు డాక్టర్‌ కుర్ట్‌ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్‌ జుర్‌ హుస్సేన్, బారీ మార్షల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు హాజరుకానున్నారు.

Rama Rao

Rama Rao

Next Story