150 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

చిత్తూరు నుండి ఓ లారీ లో అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల నల్ల బెల్లం, 1 టన్ను పటికను మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారు అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.

S. Srikanth
Published on: 28 Nov 2019 10:17 AM IST
150 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
X
ఎక్సైజ్ సి.ఐ రమేష్ చందర్, జిల్లా టాస్క్ ఫోర్స్ స్కాడ్ సి.ఐ కృష్ణ, ఇతర సిబ్బంది

మహబూబాబాద్: చిత్తూరు నుండి ఓ లారీ లో అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల నల్ల బెల్లం, 1 టన్ను పటికను మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారు అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకొని ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో సి.ఐ రమేష్ చందర్ వెల్లడించారు.

లారీకి ఎస్కార్ట్ గా పోతున్న స్విఫ్ట్ కారును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ శివారులోని ఏటిగడ్డ తండాకు చెందిన సుమన్ బెల్లం రవాణాకు ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడని, మరో ముగ్గురు గుగులోత్ రమేష్, దిలీప్, డ్రైవర్ లను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా టాస్క్ ఫోర్స్ స్కాడ్ సి.ఐ కృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story