Hyderabad - Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్‌‌లో దారుణం

Hyderabad - Miyapur: ఓంకార్ నగర్‌లో నిన్న కనిపించకుండా పోయిన 13 నెలల చిన్నారి విగతజీవిగా కనిపించింది.

Shireesha
Updated on: 13 Sept 2021 12:47 PM IST
13 Months Old Baby Missing Case in Miyapur Hyderabad Ended Sadly | Telangana News
X

హైదరాబాద్‌లోని మియాపూర్‌‌లో దారుణం

Hyderabad - Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్‌‌లో దారుణం చోటుచేసుకుంది. ఓంకార్ నగర్‌లో నిన్న కనిపించకుండా పోయిన 13 నెలల చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఇంటి సమీపంలోని నీటి సంపులో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నిన్న సాయంత్రం నుంచి పాప కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల అంతా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాయంత్రం కనిపించకుండ పోయిన చిన్నారి తెల్లవారుజామున శవమై కనిపించింది. పాప అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పాపకు గాయాలైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎవరో కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అసలు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ రావడం లేదు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఓంకార్‌నగర్‌వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story