సికింద్రాబాద్ సాకేత్ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు

సికింద్రాబాద్  సాకేత్ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు
x
Highlights

సికింద్రాబాద్ కాప్రా మునిసిపల్ పరిధి సాకేత్ టౌన్ షిప్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కాప్రా ఉపకమిషనర్ ఎ.శైలజ తెలిపారు.

సాకేత్ టౌన్ షిప్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కాప్రా ఉపకమిషనర్ ఎ.శైలజ తెలిపారు. మంగళవారం బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు సాకేత్ లోని మిథిల, పార్క్ రెసిడెన్సి బహుళ అంతస్తుల పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ స్వర్ణరాజ్ తో కలిసి డీసీ పర్యటించారు.

ఈ స్సంధర్భంగా పార్క్ రెసిడెన్సి బహుళ అంతస్తుల వెనుకవైపున ఉన్న మురికివాడల్లో సరైన నీటి పారుదల వ్యవస్త లేకపోవడంతో ఎగువ ప్రాంతాలనుంచి మురుగు నీరు వచ్చి చేరుతోందని స్థానికులు, వార్డు కమిటి సభ్యులు కమల్ పంత్ డీసీ దృష్టికి తీసుకెళ్ళారు. సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఏ ప్రాంతాల నుంచి మురుగు పోటేత్తుతుందో డీసీ పరిశీలించారు. మిథిలలో కొత్త రోడ్లు నిర్మించాలని, పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని బస్తీవాసులు కోరారు. డీసీ స్పందిస్తూ మురుగు నీటిని మళ్ళిస్తామని, రోడ్ పనులు త్వరలో పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ మైత్రేయి, డీఈ బాలకృష్ణ, ఏఈ ఆశ, మిథిల అధ్యక్షులు పీబీ రావు, కార్యదర్శి శ్రీలక్ష్మి, రెసిడెన్సి నేతలు ఉమామహేశ్వర్ రావు, జ్ఞాన్ లు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories