Shocking Facts: స్మార్ట్‌ఫోన్‌లో ప్రజలు ఎక్కువగా ఏం చూస్తున్నారు.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

What People are Looking at the Most on the Smartphone the Study Revealed Shocking Facts
x

Shocking Facts: స్మార్ట్‌ఫోన్‌లో ప్రజలు ఎక్కువగా ఏం చూస్తున్నారు.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

Highlights

Shocking Facts: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇంటర్నెట్‌ సాయంతో సులువుగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.

Shocking Facts: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇంటర్నెట్‌ సాయంతో సులువుగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా టెలికాం రంగంలోకి రిలయన్స్‌ జియో వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్‌ చౌకగా లభిస్తుంది. దీంతో చాలామంది ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు సోషల్ మీడియాలో యక్టివ్‌గా ఉంటున్నారని తేలింది. డిజిటల్ అడ్వైజరీ సంస్థ కాపియోస్ ప్రకారం ఈ సంఖ్య గత సంవత్సరం కంటే 3.7 శాతం పెరిగినట్లు తేలింది. ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 5.19 బిలియన్లుగా తేల్చారు.

ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అనేది ప్రాంతాల వారీగా మారుతుందని ఈ నివేదిక చెబుతోంది. తూర్పు, మధ్య ఆఫ్రికాలో 11 మందిలో ఒకరు మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తుండగా భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో గడిపే సమయం కూడా పెరిగింది. ఇది రోజుకు రెండు నిమిషాల నుంచి రెండు గంటల 26 నిమిషాలకు పెరిగింది. సోషల్ మీడియాలో బ్రెజిలియన్లు రోజుకు సగటున 3 గంటల 49 నిమిషాలు గడుపుతుండగా, జపాన్ ప్రజలు 1 గంట కంటే తక్కువ సమయం గడుపుతున్నారు. అలాగే సగటు సోషల్ మీడియా వినియోగదారు 7 ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఇండియాలో వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఎక్కువగా గడుపుతున్నారు. అలాగే చైనాలో WeChat, Tik Tok, Douyin అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లుగా తెలిపారు. అదే సమయంలో యుఎస్ ఖచ్చితమైన నివేదిక ప్రకారం.. టిక్‌టాక్ యాప్‌కి అద్భుతమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ యుఎస్‌లో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10 మంది పిల్లలలో దాదాపు 9 మంది యూట్యూబ్‌ని ఉపయోగిస్తున్నట్లు తేలింది. 10 మందిలో 4 మంది పిల్లలు టిక్‌టాక్ ఉపయోగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories