Vivo V21 Mobile: అద్భుతమైన ఫీచర్స్ తో వివో వి21 5జీ మొబైల్

Vivo V21 Mobile: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో నుంచి మరో సరికొత్త 5జి స్మార్ట్‌ ఫోన్ విడుదల కానుంది.

Kranthi
Published on: 29 April 2021 11:57 AM IST
Vivo V21 Price in India, Specifications | Vivo V21 5G Pro Features
X

vivo v21 smart phone

Vivo V21 Mobile: వివో యాజమాన్యం చెప్పిన విధంగా ఈ రోజు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో వి21 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. రెండు రోజుల క్రితమే.. వివో వి21 గురించి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివో వి21 5జి ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారతదేశంలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ వివరాలన్నింటినీ వెల్లడించిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో.. ధర గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. వివో v20 ధర ప్రస్తుతం దేశంలో 22,990 గా ఉంది. కాగా వివో వి 21 5 జి ధర కొంచెం అదనంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

వివో వి21 5జి ఫీచర్స్..

ఈ ఫోన్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తోపాటు 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేతో వస్తుంది. వివో వి21లో సింగిల్ లెన్స్‌తో రానుంది. వివో వి21లో బ్యాక్ కెమెరా ట్రిపుల్ రియర్ సెటప్‌ అందించారు. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు తోడ్పడుతుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ఫోన్‌లో 5జీకి సపోర్ట్ కూడా ఉంటుంది. వివో వి 21 5 జి ఆర్కిటిక్ వైట్, డర్క్ బ్లూ, సన్‌సెట్ డాజిల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 లభిస్తుంది.

Kranthi

Kranthi

Next Story