ఎండాకాలం మరో బ్యాడ్‌న్యూస్.. ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరిగే అవకాశాలు..!

ఎండాకాలం మరో బ్యాడ్‌న్యూస్.. ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరిగే అవకాశాలు..!
ACs Fridge Prices: అసలే ఎండలు మండిపోతుంటే మరోవైపు ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు కూడా హీటెక్కిస్తున్నాయి.
ACs Fridge Prices: అసలే ఎండలు మండిపోతుంటే మరోవైపు ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు కూడా హీటెక్కిస్తున్నాయి. పలు కంపెనీల నిర్వాహకులు మరోసారి ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలని పెంచడానికి సిద్దమవుతున్నారు. దీంతో ఈ ఎండాకాలం మరింత ఉక్కపోత తప్పదు. విద్యుత్ కోతలు పెరిగినా, కరెంటు ఛార్జీలు పెరిగినా ఒక ఏసీ కొనాలని అనుకునే వారికి కంపెనీలు షాక్‌ల మీద షాక్‌నిస్తు్నాయి. ఇంధన ధరలు పెరగడం, గ్లోబల్ కాంపోనెంట్స్ కొరత వంటి అనేక కారణాల వల్ల భారతీయ AC తయారీదారులు ధరలను పెంచుతున్నారు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే వీటి ధరలను 3-5 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
పెరిగిన ధరలపై ఎలక్ట్రానిక్స్ తయారీదార్ల సంఘం సీమా అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా వివరణ ఇస్తూ.. 'ఇప్పటికే ముడి పదార్థాల ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరిగిపోవడంతో, దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అందువల్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను త్వరలోనే 3-5 శాతం పెంచుతున్నామని తెలిపారు. ప్రధానంగా చైనాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌లు, ముడి సరుకు కొరత, వస్తువుల ధరల ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడ్డ అనేక పరిస్థితులు ఈ భారానికి కారణమని చెబుతున్నారు.
ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. 'ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది' అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT