Realme C11: తక్కువ ధరలో రియల్ మీ కొత్త ఫోన్!

Realme C11: ఈ ఫోన్ ఫిలిప్పీన్స్‌లో 4990 పెసోలుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.7,600)

Venkata Chari
Updated on: 5 May 2021 7:28 PM IST
Realme C11 2021 Smartphone Specification Features
X

రియల్ మీ C11 

Realme C11: రియల్ మీ సీ11(2021) స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన రియల్ మీ సీ11కి నెక్ట్ వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. అయితే ఇందులో వాడిన ప్రాసెసర్ మాత్రం యూనిసోక్ కంపెనీకి చెందినది. కొత్త ప్రాసెసర్ తో విడుదలైన మొదటి ఫోన్‌ ఇదే.

ఈ ఫోన్ ఫిలిప్పీన్స్‌లో 4990 పెసోలుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.7,600) సేల్ కానుంది. దీనిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ అందించారు. ఐరన్ గ్రే, లేక్ బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై వర్క్ చేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌ కాగా, యూనిసోక్ ఎస్సీ9863 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది. 2 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్‌లో స్టోరేజ్‌లను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో బ్యాక్‌సైడ్ 8 MP కెమెరాను అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 MP కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. జీపీఎస్, ఓటీజీ సపోర్టు, మైక్రో యూఎస్‌బీ పోర్టు, వైఫై, 4జీ, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story