Pubg Mobile Game: పబ్జ్ మొబైల్ గేమ్ అభిమానులకు శుభవార్త

Pubg Mobile Game: ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలో ఇండియాలో పబ్జ్ మొబైల్ గేమ్ లాంచ్ కానున్నట్లు సమాచారం.

Kranthi
Published on: 16 May 2021 10:36 AM IST
Pubg Mobile Game India Version Battle Ground Mobile India
X

Pubg Mobile Game:(File Image) 

Pubg Mobile Game: ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన మొబైల్ యాక్షన్, బ్యాటిల్ గేమ్ పబ్జీ మళ్ళీ భారత్ లోకి అడుగుపెత్తబోతోంది. 'బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా' పేరుతో త్వరలో ఇండియాలో పబ్జ్ మొబైల్ గేమ్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మన దేశంలో పిల్లలతో పాటు, పెద్దలు, రాజకీయ నాయకులకు కూడా చాలా ఇష్టమైనది ఈ పబ్జీ గేమ్. ఈ విషయం తెలిసిన పబ్జ్ అభిమానులు ఎప్పుడు ఈ గేమ్ అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారికోసం పబ్జ్ ఇండియా శుభవార్త చెప్పింది. జూన్ నెలలో పబ్జ్ కొత్త గేమ్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా లాంచ్ చేయబోతున్నట్టు చెప్పింది. ఈ గేమ్ కు సంబంధించి ట్రైలర్ మే 31న విడుదల చేయనున్నారు. కచ్చితమైన తేదీ ప్రకటించనప్పటికీ.. ఈ గేమ్ జూన్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పబ్జ్ మొబైల్ కాస్టర్ ఓషన్ శర్మ మీడియాకు వెల్లడించారు.

"నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, మేలో రెండు ప్రధాన ప్రకటనలు వస్తాయి, వాటిలో ఒకటి ఈ రోజు జరిగింది. ఇది కేవలం టీజర్ అయితే, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే ఈ నెలాఖరులోగా ట్రైలర్ రావచ్చు. జూన్ నాటికి గేమ్ అందుబాటులో ఉంటుంది "అని టీజర్ లాంచ్ సందర్భంగా శర్మ వెల్లడించారు. పబ్జ్ గేమ్ భారతదేశం కోసం ప్రత్యేకమైన వెర్షన్ అందుబాటులోకి తీసుకువస్తున్నా.. ఆట చాలా అంశాలలో అసలు పబ్జ్ మొబైల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా, ఆట యొక్క భారతీయ సంస్కరణలో ఇక్కడ ఒక చిన్న మార్పు ఉండే అవకాశం ఉంది. పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. విద్యార్థులు, యువత ఆ గేమ్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలను మనం అనేకం చూశాం.

Kranthi

Kranthi

Next Story