Poco X3 Pro: ఇండియాలో పోకో ఎక్స్ 3 ప్రో లాంఛ్; ధర, ఫీచర్స్ తెలుసుకోండి

Poco X3 Pro: పోకో ఎక్స్ 3 ప్రోను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు పోకో అధికారికంగా ప్రకటించింది.

Venkata Chari
Published on: 31 March 2021 5:47 PM IST
Poco X3 Pro Mobile Launched in India | Poco X3 Pro Features and Price
X

పోకో ఎక్స్ 3 ప్రో (ఫొటో: ది హన్స్ ఇండియా)

Poco X3 Pro: పోకో ఎక్స్ 3 ప్రోను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు పోకో అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ .18,999 కు లభిస్తుంది. టాప్-ఎండ్ మోడల్ రూ .20,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 6 న ఫ్లిప్‌కార్ట్ లో మొదటిసారి సేల్ కు వస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఇఎంఐ లావాదేవీలతో ఫోన్ కొనుగోలు చేస్తే.. 10 శాతం తగ్గింపు (రూ .1,000 వరకు) అందిస్తుంది. ఫోన్ మూడు రంగులలో లభిస్తోంది.

పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్

పోకో ఎక్స్ 3 ప్రో 6.67 అంగుళాల స్క్రీన్‌ తోపాటు పూర్తి హెచ్‌డీ + రిజల్యూషన్ తో వస్తుంది. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో రానుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే పోకో లాంచర్ 2.0 తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. పోకో ఎక్స్ 3 ప్రో వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఈ డిజైన్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫ‌్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

పోకో ఎక్స్ 3 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. బేస్ మోడల్‌లో 6 జీబీ ర్యామ్, టాప్ మోడల్ లో 8జీబీ ర్యామ్ అందించారు. ఇక రెండూ మోడల్స్ లో 128 జీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్ అందించారు. మెరుగైన పనితీరు కోసం ఇందులో లిక్విడ్‌కూల్ టెక్నాలజీ ప్లస్‌ను అందించారు. దీంతో ఫోన్ హీట్ కాకుండా, హ్యాంగ్ అవ్వకుండా పనిచేస్తుంది. ఇందులో 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5,160 mAh బ్యాటరీతో రానుంది.

Venkata Chari

Venkata Chari

Next Story