Poco M3 Pro 5G: పోకో స్మార్ట్ ఫోన్ 5జీ రూ.13,999లకే

Poco M3 Pro 5G: షావోమీకి చెందిన మరో స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ అయిన పోకో స్మార్ట్‌ ఫోన్‌ 5జీ ని ఇండియాలో రిలీజ్ చేసింది.

Sandeep Eggoju
Published on: 8 Jun 2021 2:43 PM IST
POCO M3 Pro 5G Smartphone Launched in India
X

POCO M3 Pro 5G (File Image)

Poco M3 Pro 5G: ప్రముఖ ఫోన్ల కంపెనీలు ఇండియాలో పెద్ద బిజినెస్ నే చేస్తున్నాయి. అతి తక్కువ ధరలకు ఎక్కువ కెపాసిటీ గల ఫోన్లను కూడా తక్కువ ధరలకు విక్రయిస్తున్నాయి. తాజాగా షావోమీకి చెందిన మరో స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ అయిన పోకో ఇండియా సంచలనం సృష్టించింది. రూ.13,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో కొద్ది రోజుల క్రితమే Poco M3 Pro 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది.

పోకో ఇండియా భారతదేశంలో రిలీజ్ చేసిన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. బాక్సులో 22.5 వాట్ ఛార్జర్ లభిస్తుంది. Poco M3 Pro 5G ప్రారంభ ధర రూ.13,999. ఇది 4జీబీ+64జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 6జీబీ+128జీబీ వేరియంట్ కూడా రిలీజ్ అయింది. ధర రూ.15,999. జూన్ 14న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలుకానుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story