Mobile Number: మొబైల్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయో తెలుసా..!?

Know About Why Mobile Number have 10 Digits in India
x

Mobile Number: మొబైల్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయో తెలుసా..!?

Highlights

Mobile Number: మనుషుల మధ్య భౌతికంగా ఎంత దూరం ఉన్నా ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ మాత్రం బంధువులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఆ దూరాన్ని మరింత తగ్గించాయి. అయితే...

Mobile Number: మనుషుల మధ్య భౌతికంగా ఎంత దూరం ఉన్నా ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ మాత్రం బంధువులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఆ దూరాన్ని మరింత తగ్గించాయి. అయితే మనం ఒక వ్యక్తితో మాట్లాడే ముందు మొబైల్ ఫోన్ లో 10 అంకెల నెంబర్ ని డయల్ చేస్తాము. ప్రతిరోజు మొబైల్ ఫోన్ వాడే మీరు.. మొబైల్ నెంబర్ 10 అంకెలు ఎందుకు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ జాతీయ నెంబరింగ్ విధానం. మొబైల్ నంబర్ 0 నుండి 9 వరకు ఒక సింగిల్ డిజిట్ నంబర్ ఉంటే, నెంబర్ ని కేవలం 10 మందికి మాత్రమే పంపిణీ చేయబడుతుంది.

ప్రస్తుతం భారతదేశ జనాభా దాదాపుగా 130 కోట్లు. ఈ కారణంగా మొబైల్ నంబర్ల సంఖ్యను 10 అంకెలుగా ఉంచారు. మొబైల్ నంబర్ 10 అంకెలు ఉండటం వలన ప్రతి నంబర్‌ను వినియోగదారులకు సులభంగా పంపిణీ చేయవచ్చు. 10 అంకెల సహాయంతో వెయ్యి కోట్ల నంబర్లను సులభంగా పంపిణి చేసే అవకాశం ఉంది. భారత్ లో మొదట 9 అంకెల నంబర్లు మాత్రమే ఉపయోగించబడగా జనాభా పెరుగుతున్న దృష్ట్యా మొబైల్ నంబర్ల అంకెల సంఖ్యను 10కి పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories