Super Smartwatches: బడ్జెట్‌లో వచ్చే సూపర్‌ స్మార్ట్‌వాచ్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది..!

Super Smartwatches: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్స్‌ కంటే స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. యువత మొత్తం వీటి వెనుక పరుగెత్తుతున్నారు.

Shekhar G
Published on: 19 Feb 2024 10:04 AM IST
Know About Super Smartwatches In Budget Price Features
X

Super Smartwatches: బడ్జెట్‌లో వచ్చే సూపర్‌ స్మార్ట్‌వాచ్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది..!

Super Smartwatches: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్స్‌ కంటే స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. యువత మొత్తం వీటి వెనుక పరుగెత్తుతున్నారు. కంపెనీలు కూడా అందరిని ఆకట్టుకోవడానికి రకరకాల ఫీచర్లతో తయారచేసి సరసమైన ధరలకు అమ్ముతున్నాయి. మీకు ఇష్టమైన స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఎక్కువ రీసెర్చ్ చేయకుండా ఫిట్‌నెస్ ఫీచర్‌లతో కూడిన మంచి వాచ్‌ కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

Bolt Crown

ఈ స్మార్ట్ వాచ్ 1.95 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో జింక్ అల్లాయ్ ఫ్రేమ్‌ పొందుతారు. పెద్ద డిస్‌ప్లే మాత్రమే కాకుండా 900 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ దీని ప్రత్యేకత. స్మార్ట్ వాచ్‌లో spo2 మానిటర్‌ ఉంటుంది. దీని ద్వారా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర కేవలం రూ.1,299 మాత్రమే

Fastrack Revolt FS1 Max

ఫాస్ట్రాక్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌వాచ్‌లో కస్టమర్‌లు కర్వ్ డిస్‌ప్లేతో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను పొందుతారు. దీని కారణంగా ఫోన్‌ను తీయకుండానే కాల్‌లు మాట్లాడవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో 100కి పైగా మల్టీ-స్పోర్ట్స్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్‌లో 1.95 అంగుళాల పెద్ద డిస్‌ప్లే చూడవచ్చు. దీనిపై మీరు అన్ని కార్యకలాపాలను సరిగ్గా పర్యవేక్షించవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2,099.

Noise thrives

ఈ స్మార్ట్ వాచ్ అతిపెద్ద లక్షణం దాని మ్యూజిక్ ప్లేబ్యాక్, వాయిస్ అసిస్టెంట్. ఇది ఏదైనా స్మార్ట్ ఫోన్‌కు గట్టి పోటీనిస్తుంది. స్మార్ట్ వాచ్ లోపల 1.85 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ప్రతి ఒక్కరి బడ్జెట్‌లో సౌకర్యవంతంగా సరిపోయేలా స్మార్ట్ వాచ్ ధర తక్కువగా ఉంది. కేవలం రూ.1,199 మాత్రమే.

Pebble Cosmos Vault

ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత దాని ప్రీమియం చైన్ డిజైన్. ఇది చాలా ఖరీదుగా కనిపిస్తుంది. దీని ధర చాలా తక్కువగా ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌లో కస్టమర్‌లు 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందుతారు. దీని విజిబిలిటీ బలంగా ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. చేతులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1,799.

Shekhar G

Shekhar G

Next Story