ఈ సీలింగ్‌ ఫ్యాన్‌తో కరెంట్‌ బిల్‌ నిల్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Kent kuhl Fan: మీరు కరెంట్‌ బిల్‌ తగ్గించాలని చూస్తున్నట్లయితే కెంట్ ఆర్వో సిస్టమ్స్ ఎనర్జీ సేవింగ్ సీలింగ్ ఫ్యాన్‌లను లాంచ్ చేసింది.

Arun Chilukuri
Updated on: 22 Jan 2023 6:01 PM IST
Kent Kuhl Fan Launched Save Current Bill Know About Price Features
X

ఈ సీలింగ్‌ ఫ్యాన్‌తో కరెంట్‌ బిల్‌ నిల్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Kent kuhl Fan: మీరు కరెంట్‌ బిల్‌ తగ్గించాలని చూస్తున్నట్లయితే కెంట్ ఆర్వో సిస్టమ్స్ ఎనర్జీ సేవింగ్ సీలింగ్ ఫ్యాన్‌లను లాంచ్ చేసింది. కుహ్ల్ బ్రాండ్ పేరుతో సీలింగ్ ఫ్యాన్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ సరికొత్త ఫ్యాన్ BLDC టెక్నాలజీతో విడుదలైంది. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ టెక్నాలజీతో కూడిన ఫ్యాన్ల వల్ల 65 శాతం విద్యుత్ ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో తక్కువ విద్యుత్తు వినియోగించే లైట్లు, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా చేరిపోయింది.

కంపెనీ ప్రకారం సీలింగ్ ఫ్యాన్‌లను ఉపయోగించే 90 శాతం ఇళ్లలో కేవలం 3 శాతం మంది మాత్రమే ఇలాంటి ఫ్యాన్‌లను కలిగి ఉన్నారు. కుహ్ల్‌ పేరుతో విడుదలైన ఈ ఫ్యాన్‌ 4, 6, 8 బ్లేడ్ ఎంపికలతో వస్తాయి. ఈ ఫ్యాన్‌లు గొప్ప ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. BLDC టెక్నాలజీతో పాటు అనేక ఫీచర్లను జోడించారు. ఈ ఫ్యాన్లు Wi-Fi, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రారంభించారు. ఈ ఫ్యాన్‌లను స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. ఇది కాకుండా వాయిస్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు.

రివర్స్ ఫంక్షన్ కారణంగా గదిలోకి వేడి గాలి కూడా వస్తుంది. ఈ ఫ్యాన్‌లు తక్కువ శబ్దం చేస్తూ మంచి గాలిని ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. BLDC టెక్నాలజీ 65% కంటే తక్కువ శక్తిని వినియోగిస్తుంది. కాబట్టి పవర్ సేవింగ్ టెన్షన్ తొలగిపోతుంది. ఈ ఫ్యాన్లకి వినియోగదారులు 5 స్టార్ రేటింగ్‌ ఇచ్చారు. దేశంలోని 120 కోట్ల డొమెస్టిక్ ఫ్యాన్స్‌లో బీఎల్‌డీసీ టెక్నాలజీని ఉపయోగిస్తే ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story