
iPhone 16e: టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16ఈ ని భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. మరోవైపు తన అధికారిక స్టోర్ నుంచి...
iPhone 16e: టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16ఈ ని భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. మరోవైపు తన అధికారిక స్టోర్ నుంచి ఐఫోన్ ఎస్ఈని తొలగించింది. తొలుత ఐఫోన్ ఎస్ఈ 4ను రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ కొత్త మోడల్ తో ఐఫోన్ 16 సిరీస్ ను ఎక్స్ పాండ్ చేసింది. మరింత మంది యూజర్లకు చేరువయ్యే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ను విడుదల చేసినట్లు సమాచారం.
ఐఫోన్ 16ఈ సిరీస్ ఫోన్లలో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఇచ్చారు. 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో తీసుకువచ్చింది. 800 నెట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంది. యాక్షన్ బటన్ కూడా ఇచ్చారు. ఏ18 చిప్ ను అమర్చారు. ఏఐ ఫీచర్లు ఈ కొత్త మోడల్ కు సైతం సపోర్ట్ చేయనున్నాయి. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. 18 వాట్స్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. వైర్ లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇచ్చారు. ఐఓఎస్ 18పై ఇది రన్ అవుతుంది. ఫేస్ రికగ్నైస్ ఫీచర్ కూడా ఉంది. యూఎస్ బీ టైప్ సీ పోర్టుకు సపోర్టు చేస్తుంది.
ఇక ధర విషయానికి వస్తే ఈ కొత్త మోడల్ ఫోన్లలో మూడు వేరియంట్స్ ఇచ్చారు. బేస్ మోడల్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. దీని ధర రూ. 59, 900గా నిర్ణయించారు. 256 జీబీ వేరియంట్ ధరను రూ. 69,900గా 512 జీబీ వేరియంట్ ను రూ. 89, 900గా నిర్ణయించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ముందస్తు ఆర్డర్స్, 28 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. బ్లాక్, వైట్ కలర్స్ లో ఈ మోడల్ ఫోన్లను తీసుకువచ్చారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




