Infinix Hot 40i: ఫిబ్రవరి 16న ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ లాంచ్‌.. 16జీబీ రామ్‌ 256జీబీ స్టోరేజ్.. ధర ఎంతంటే..?

Infinix Hot 40i:ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ ఇండియాలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనుంది. ఫిబ్రవరి 16న ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐని విడుదల చేయనుంది.

Jyothi
Updated on: 15 Feb 2024 12:25 PM IST
Infinix Launching Hot 40i in India on 16th Feb Check for all Details
X

Infinix Hot 40i: ఫిబ్రవరి 16న ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ లాంచ్‌.. 16జీబీ రామ్‌ 256జీబీ స్టోరేజ్.. ధర ఎంతంటే..?

Infinix Hot 40i: ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ ఇండియాలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనుంది. ఫిబ్రవరి 16న ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐని విడుదల చేయనుంది. ఇది ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 30 ఐ కొత్త వెర్షన్‌. ఈ ఫోన్‌ ప్రత్యేక ఫీచర్లు, దానిని ఎక్కడ పొందాలి, ధర ఎంత తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ లాంచ్ తేదీ

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 16న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ వెల్లడించింది. తర్వాత ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 16GB ర్యామ్‌ ఉంటుంది. ఇందులో 8జీబీ వర్చువల్ ర్యామ్‌ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఇది 256జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ స్టోరేజ్‌

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ స్టోరేజీ పెంచడానికి ఒక ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. ఇది స్టోరేజ్‌ని 2టీబీ వరకు పెంచుతుంది. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఫోన్‌లో బ్యాక్‌ రెండు కెమెరాలు ఉంటాయి. ఎల్‌ఈడీ ఫ్లాష్ అందుబాటులో ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ స్పెసిఫికేషన్లు

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ 6.56 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ఫోన్ ఉత్తమ పనితీరు కోసం ఇది Unisoc T606 చిప్‌ని కలిగి ఉంటుంది. అలాగే 8జీబీ ర్యామ్‌, దీనిని 16జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో ఫొటోల కోసం రెండు కెమెరాలు ఉంటాయి. బ్యాక్‌వైపు 50MP ప్రధాన కెమెరా, మరొక 2 ఎంపీ AI కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40 ఐ లో అందించారు. ఇది 5,000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

Jyothi

Jyothi

Next Story