Google Pixel 7 Proపై భారీ తగ్గింపు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే..?

Huge Discount On Google Pixel 7 Pro Know The Price On Amazon Flipkart
x

Google Pixel 7 Proపై భారీ తగ్గింపు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే..?

Highlights

Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్‌ 7 ప్రోపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపులు ప్రకటించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2022 సంవత్సరంలో ప్రారంభించారు.

Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్‌ 7 ప్రోపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపులు ప్రకటించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2022 సంవత్సరంలో ప్రారంభించారు. దీని ఫీచర్లు, కెమెరా అద్భుతంగా ఉంటాయి. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. Google Pixel 7 Pro ఫీచర్లు, వివిధ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న తగ్గింపుల వివరాలను ఈ రోజు తెలుసుకుందాం.

Google Pixel 7 Pro: Flipkart తగ్గింపు

గూగుల్ పిక్సెల్ 7 ప్రో రూ.84,999కి మార్కెట్లోకి విడుదలైంది. అయితే మీరు Flipkart నుంచి 21 శాతం తగ్గింపుతో రూ.66,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ.18,000 ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అనేక బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ డీల్ 12GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌పై అందిస్తున్నారు.

Google Pixel 7 Pro: Amazon తగ్గింపు

Amazon డిస్కౌంట్‌ల గురించి మాట్లాడినట్లయితే ఈ ఫోన్‌ని 10 శాతం తగ్గింపుతో కేవలం రూ. 72,000కే అందిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్ కస్టమర్ల సౌలభ్యం కోసం EMI ఆప్షన్‌ కూడా ఉంది. ఇందులో మీరు నెలవారీ రూ.3,242 మాత్రమే చెల్లించాలి. Google Pixel 7 Pro 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్‌లో 4926mAh శక్తివంతమైన బ్యాటరీని పొందుతారు. ఇది 30W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

పిక్సెల్ 7 ప్రో ఆక్టా-కోర్ టెన్సర్ G2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories