స్నేహితులైనా పర్వాలేదు ఈ సాయం చేయొద్దు.. లేదంటే దివాళ తీస్తారు..!

Giving SIM Card to Others will Lead to Problems Close that Number Immediately
x

స్నేహితులైనా పర్వాలేదు ఈ సాయం చేయొద్దు.. లేదంటే దివాళ తీస్తారు..!

Highlights

SIM Card Fraud: కొన్నిసార్లు మనం తెలియక చేసే చిన్న తప్పు వల్ల చాలా ఇబ్బందుల్లో పడుతాం. ఈ సమస్య కూడా అలాంటిదే. స్నేహితుడైనా పర్వాలేదు ఈ విషయంలో అస్సలు సాయం చేయకూడదు.

SIM Card Fraud: కొన్నిసార్లు మనం తెలియక చేసే చిన్న తప్పు వల్ల చాలా ఇబ్బందుల్లో పడుతాం. ఈ సమస్య కూడా అలాంటిదే. స్నేహితుడైనా పర్వాలేదు ఈ విషయంలో అస్సలు సాయం చేయకూడదు. ఎందుకంటే తర్వాత మీరు దివాళతీయడమే కాదు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లు వాడుతారు. అందులో ఒకదానిని మీ స్నేహితుడికి లేదా దగ్గరివారికి ఇస్తారు. తర్వాత రకరకాల సమస్యలని ఎదుర్కొంటారు. సిమ్‌కార్డ్‌ మోసాలు ఏ విధంగా జరుగుతాయో ఈరోజు తెలుసుకుందాం.

ఒక వ్యక్తికి రెండు సిమ్ కార్డులు ఉన్నాయి అనుకుందాం. అతను ఒక సిమ్ కార్డును తన స్నేహితుడికి లేదా అవసరమైన వ్యక్తికి ఇచ్చాడు. అతడు ఆ సిమ్‌ని ఉపయోగించడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి తన అడ్రస్‌ని మార్చుకుని వేరే ప్రదేశంలో నివసించడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత సిమ్‌ ఇచ్చిన వ్యక్తికి రెండో నంబర్ అవసరం వచ్చింది. స్నేహితుడికి ఫోన్ చేయాలని ప్రయత్నించాడు. కానీ సమాధానం ఉండదు. తర్వాత కంపెనీకి వెళ్లి స్నేహితుడకి ఇచ్చిన నెంబర్‌తో సిమ్‌ తీసుకుంటాడు.

ఆ నంబర్ ప్రారంభమైన తర్వాత ఆ వ్యక్తికి రుణాన్ని చెల్లించమని బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది స్నేహితుడు తన ఐడీతో బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడని. తర్వాత ఆ రుణం సదరు వ్యక్తి తిరిగి చెల్లించాల్ ఉంటుంది. సిమ్‌లు ఇవ్వడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మీ ఐడిపై తీసుకున్న సిమ్‌ను మరొక వ్యక్తికి ఇవ్వడం తర్వాత ఆ వ్యక్తి ఈ సిమ్‌తో ఏదైనా తప్పు చేస్తే పోలీసు చర్యకి బాధ్యులవుతారు. ఎందుకంటే సిమ్ ఎవరి ఐడిపై ఉంటుందో వారే దోషుల జాబితాలోకి వస్తారు.

సిమ్ కార్డ్‌ బ్లాక్ చేయండి

1. ఇందుకోసం ముందుగా https://tafcop.dgtelecom.gov.in/alert.php) ఈ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.

2. తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వచ్చిన OTPని పోర్టల్‌లో నింపండి.

3. ఇక్కడ మీ ఐడిపై ఉన్న కనెక్షన్‌ల గురించిన సమాచారాన్ని చూస్తారు.

4. ఇక్కడ అవసరం లేని నంబర్‌ను బ్లాక్ చేయడానికి రెక్వెస్ట్‌ ఆప్షన్ కనిపిస్తుంది.

5. దానిపై క్లిక్ చేయడం వల్ల కొన్ని వారాలలో ఆ సిమ్‌ క్లోజ్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories