Amazon: బంపర్ అఫర్.. రూ.15 లక్షలు మీసొంతం!

Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ ఆఫర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Venkata Chari
Updated on: 19 March 2021 9:16 PM IST
Amazon Announces Amazon Smbhav Awards
X

అమెజాన్ (ఫొటో ట్విట్టర్)

Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ ఆఫర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ఇండియా స్కైలాంజా భాగస్వామ్యంతో 'అమెజాన్ సంభవ్ - బిల్డ్ ఫర్ ఇండియా' పేరుతో హ్యాకథాన్‌ను ప్రకటించింది. డెవలపర్లు ఈ కార్యక్రమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కోసం దేశంలోని సమస్యలకు పరిష్కారాలను సాంకేతికత (టెక్నాలజీ) పరంగా కనుగొనడమే దీని ప్రధాన లక్ష్యం. డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఇదో మంచి అవకాశం. మొత్తం పది మంది విజేతలకు కలిపి రూ.15 లక్షల ప్రైజ్ అందిస్తారు.

అదేకాక, విజేతలు రీడీమ్ చేసుకోవడానికి అమెజాన్ వెబ్ సిరీస్ క్రెడిట్లను కూడా ఇవ్వనున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తల వెబినార్, మీటింగ్ సెషన్లలో పాల్గొనే సదవకాశం లభించనుంరని ఎంఎస్‌ఎంఇ, సెల్లింగ్ పార్ట్‌నర్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ ప్రణబ్ భాసిన్ అన్నారు. బిజినెస్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ అండ్ హెల్త్ కేర్ అనే రెండు థీమ్స్ ఉంటాయి. వీటిపై డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పని చేయాల్సి ఉంటుంది. అంటే స్మార్ట్ సిటీస్, ఎనర్జీ ఎఫిషియన్సీ, డేటా అనలిటిక్స్, ఆన్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు వంటి పలు వాటికి సంబంధించిన ప్రొడక్టులను తయారుచేయాల్సి ఉంటుంది. మార్చి 22 వరకే రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం... రిజిస్ట్రేషన్ చేసుకోండి... ప్రైజ్ మనీని సొంతం చేసుకోండి.

Venkata Chari

Venkata Chari

Next Story