ICCT20 World Cup: సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా మహిళా జట్టు

-4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం -అందరి కంటే ముందే సెమీస్‌ బెర్తు దక్కించుకున్న భారత్

admin1
Published on: 2 March 2020 10:39 PM IST
ICCT20 World Cup:  సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా మహిళా జట్టు
X
ఆస్ట్రేలియా ఫైల్ ఫోటో

ఆస్ట్రేలియా, మహిళల టీ20 వరల్డ్ కప్లో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మరో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న తాజా టోర్నీలో ఆసీస్ అమ్మాయిలు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. గ్రూప్‌–ఎ మ్యాచ్‌లో ఆ జట్టు నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ నడుమ విజయం సాధించింది. గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధించే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్‌‌ బెత్‌ మూనీ హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన న్యూజిలాండ్‌ జట్టు ఏడు వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి కొద్దిలో విజయం చేజార్చుకుంది. గ్రూప్‌లో మూడు విజయాలు, ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆసీస్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. గ్రూప్‌ టాపర్‌‌గా భారత్ అందరికంటే ముందుగానే సెమీస్‌ బెర్తు దక్కించుకుంది.

admin1

admin1

Next Story