Wimbledon Tennis: నేటి నుంచే వింబుల్డన్‌ ఓపెన్ టెన్నిస్.. 24వ టైటిల్‌పై గురిపెట్టిన జకోవిచ్‌

Wimbledon Tennis: ప్రపంచంలో చరిత్ర సృష్టించిన జకోవిచ్

Shekhar G
Published on: 3 July 2023 10:10 AM IST
Wimbledon Open Tennis Starting Today
X

Wimbledon Tennis: నేటి నుంచే వింబుల్డన్‌ ఓపెన్ టెన్నిస్.. 24వ టైటిల్‌పై గురిపెట్టిన జకోవిచ్‌

Wimbledon Tennis: ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజయంతో టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన జకోవిచ్‌.. ఇప్పుడు మరో రికార్డుపై కన్నేశాడు. 24వ టైటిల్‌తో ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్‌ కోర్ట్‌ను సమం చేయాలని చూస్తున్నాడు. అది కూడా తనకు తిరుగులేని వింబుల్డన్‌లో నేడు ఆరంభమవుతున్న ఈ టోర్నీలో అతనే టైటిల్‌ ఫేవరెట్‌...

మరో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వచ్చేసింది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. వరుసగా నాలుగు టోర్నీల్లో విజేతగా నిలిచిన నొవాక్‌ జకోవిచే పైనే అందరి దృష్టి ఉంది. అతను వరుసగా అయిదోది.. మొత్తం మీద ఎనిమిదో వింబుల్డన్‌ ట్రోఫీ అందుకుంటాడా.. ? లేదా..? అన్నదే ఆసక్తికర అంశం... ఈసారి గెలిస్తే.. ఓపెన్‌ శకంలో అత్యధికంగా 8 వింబుల్డన్‌ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్‌ సరసన జకోవిచ్ నిలుస్తాడు. మరి ఈ టైటిల్‌ చేరకుండా అతనికి అడ్డు నిలిచే ఆటగాడు ఉన్నాడా...? ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌లో నొవాక్‌కు పోటీ ఉంటుందా...? అనే అంశం తేలాలి....

రెండో సీడ్‌ జకోవిచ్ ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో కండరాల నొప్పితో ఇబ్బంది పడి జకోవిచ్‌ చేతిలో ఓడిన.. ప్రపంచ నంబర్‌ వన్‌ అల్కరాస్‌ వింబుల్డన్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి... ఈ టాప్‌ సీడ్‌ ఆటగాడు అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తే.. ఫైనల్లో జకోవిచ్‌ను ఢీ కొట్టే అవకాశముంది.

నిరుటి రన్నరప్‌ కిర్గియోస్‌, హోల్గర్‌ రూన్‌, రూడ్‌, జ్వెరెవ్‌, బెరెట్టిని, సిట్సిపాస్‌, థీమ్‌, మెద్వెదెవ్‌ లాంటి ఆటగాళ్లూ టైటిల్‌పై కన్నేశారు. మహిళల సింగిల్స్‌లో పోలండ్‌‌కు చెందిన ప్రపంచ నంబర్‌వన్‌ స్వైటెక్‌ తొలి వింబుల్డన్‌ టైటిల్‌ కోసం బరిలో దిగుతోంది. వరుసగా రెండో ఏడాదీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన స్వైటెక్‌ జోరుమీదుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రిబాకిన, సబలెంక, జాబెర్‌, కోకో గాఫ్‌, క్విటోవా, ముచోవా కూడా గట్టి పోటీదారులే... వైల్డ్‌కార్డు ప్రవేశంతో అడుగుపెట్టిన 43 ఏళ్ల వీనస్‌ ఎంత దూరం వెళ్తుందో కూడా చూడాలి.

Shekhar G

Shekhar G

Next Story