Anushka Sharma Net Worth: కోహ్లీకి తీసిపోదు.. అనుష్క శర్మ సంపాదన తెలిస్తే వావ్ అంటారు!

Anushka Sharma Net Worth: కోహ్లీకి తీసిపోదు.. అనుష్క శర్మ సంపాదన తెలిస్తే వావ్ అంటారు!
x
Highlights

Anushka Sharma Net Worth: మార్చి9వ తేదీన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత విరాట్ అనుష్కను కౌగిలించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో...

Anushka Sharma Net Worth: మార్చి9వ తేదీన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత విరాట్ అనుష్కను కౌగిలించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్య కెమిస్ట్రీ చాలా మందికి నచ్చుతుంది. వీరిద్దరికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ తో వివాహం అనంతరం అనుష్క సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే అనుష్క శర్మ సంపాదనలో మాత్రం విరాట్ తో పోటీ పడుతోంది. అనుష్క శర్మ నికర విలువ ఎంతో తెలుసుకుందాం.

అనుష్క మొత్తం సంపద రూ.255 కోట్లు. ఆమె ఒక సినిమాకు రూ. 10-15 కోట్లు, ఒక ప్రకటనకు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటుంది. ఆమె దగ్గర రేంజ్ రోవర్ వోగ్ కారు ఉంది. దీని ధర దాదాపు రూ. 2.5 కోట్లు. దీనితో పాటు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి Q8, BMW 7 ఉన్నాయి. ఈ కార్లన్నీ రూ. 10 కోట్లకు పైగా ఖరీదు చేస్తాయి. అనుష్క శర్మ తన కెరీర్‌ను 2008లో ప్రారంభించింది. ఇందులో పికూ, బ్యాండ్ బాజా బారాత్, జీరో, పారి, ఏ దిల్ హై ముష్కిల్, కాలా ఉన్నాయి. విరాట్‌తో వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమైనప్పటికీ, ఆ నటికి సొంత నిర్మాణ సంస్థ కూడా ఉందని, దాని నుండి బాగానే సంపాదిస్తుంది. నిర్మాణ సంస్థ పేరు 'క్లీన్ స్లేట్' ఫిల్మ్స్. ఆమె ఒక దుస్తుల బ్రాండ్ యజమాని కూడా. ప్రకటనల ద్వారా చాలా సంపాదిస్తుంది.

విరాట్ కోహ్లీ ఆస్తులు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం మొత్తం సంపద రూ.1050 కోట్లు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ నికర విలువను కలిగి ఉన్నాడు. కోహ్లీ ఒక ప్రకటనకు 7.5 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడు. దీన్ని బట్టి అనుష్క శర్మ నికర విలువ విరాట్ కోహ్లీ కంటే తక్కువ అని తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories